చంద్రబాబు నాయుడుని ఉరి వెయ్యాలి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు మీడియా ముందు రెచ్చిపోతున్నారు. వ్యక్తుల మీద వ్యవస్థల మీద అడ్డు అదుపు లేకుండా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉరి వెయ్యాలి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డిని పంచాయతీ ఎన్నికల పూర్తయ్యే వరకు గృహనిర్బంధంలో పెట్టాలి అన్నదాని మీద ఆయన ఈ విధంగా అన్నారు.
“నిమ్మగడ్డ ఆదేశాలు అప్రజాస్వామికం.. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నికల కమిషనర్ ను నేరుగా బెదిరించారు..
చర్యలు తీసుకోవాల్సి వస్తే చంద్రబాబును ఉరి వేయాలి,” అని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా జగన్ కూడా స్వయంగా ఇటువంటి వ్యాఖ్యలే చంద్రబాబు మీద చేశారు.
దానితో ఆయన మంత్రులని నియంత్రిస్తారు అనుకునే అవకాశం లేదు. మరోవైపు. నిమ్మగడ్డ ఇచ్చిన గృహనిర్బంధం ఆర్డర్ ని అమలు చెయ్యరాదని పోలీసులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. అవసరమైతే దాని మీద హైకోర్టుని ఆశ్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. మరోవైపు. పెద్దిరెడ్డి ఎస్ఈసి ఆదేశాలను ఉల్లంఘించి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారుమరోవైపు. నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోకుండా చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఏకగ్రీవంగా గెలిచిన వారందరికీ డిక్లరేషన్లు అందజేయాలని జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ప్రభుత్వం నుండి ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తాము చెప్పినట్టు చెయ్యకపోతే ఎన్నికల తరువాత గుణపాఠం తప్పదని మంత్రులు ఇప్పటికే ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు
మరోవైపు. నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోకుండా చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఏకగ్రీవంగా గెలిచిన వారందరికీ డిక్లరేషన్లు అందజేయాలని జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ప్రభుత్వం నుండి ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తాము చెప్పినట్టు చెయ్యకపోతే ఎన్నికల తరువాత గుణపాఠం తప్పదని మంత్రులు ఇప్పటికే ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.