Andhra PradeshCrimeTelangana
ఘోర రోడ్డుప్రమాదం ఏడుగురు అక్కడికక్కడే మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్ – ఆగ్రా రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మినీ బస్సు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులను సీఎం యోగి ఆదేశించారు.