AnanthapurAndhra Pradesh
ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
రాయదుర్గం టౌన్ డిసెంబర్ 21రాయదుర్గం పట్టణంలో స్థానిక వినాయక సర్కిల్ నందు సోమవారం ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైసీపీ అభిమానులు కార్యకర్తలు నడుమ కేక్ కట్ చేయడం జరిగింది. జై జగన్ అనే నినాదాలతో పట్టణంలోని వినాయక సర్కిల్ మార్మోగింది. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మెన్ కాపు భారతి ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదానం చేసిన దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ ఇన్చార్జి ముస్తాక్, మండల కన్వీనర్లు ,వైసిపి వార్డు అభ్యర్థులు, అభిమానులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగింది..