ఘనంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు
పులివెందుల డిసెంబర్ 20 పట్టణం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు.చిన్నప్ప ఆధ్వర్యంలో… ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ వేడుకలకు ముఖ్య అతిధిలు గా వైకాపా మునిసిపల్ ఇన్ ఛార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి, వైకాపా డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్. అభిషేక్ రెడ్డి లు పాల్గొన్నారు
ముందుగా ముఖ్యమంత్రి జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు… అనంతరం చిన్నప్ప ఏర్పాటు చేసిన దుస్తులను 100 మంది నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు బలరాం రెడ్డి, దేవాలయాల కమిటీ చైర్మన్ వెంకటసుబ్బయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్వోత్తమ్ రెడ్డి, వాల్మీకి సంఘం రాష్ట్ర డైరెక్టర్ నారాయణ స్వామి, బూత్ కమిటీ నాయకులు గంగాధర్ రెడ్డి, పుష్పనాథ్ రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్ లు కోళ్ల.భాస్కర్, వికలాంగుల నెట్ వర్క్ రాష్ట్ర అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు, ప్రజలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అభిమానులు, వివిధ అనుబంధ సంస్థ ల నాయకులు తదితరులు పాల్గొన్నారు