Andhra PradeshYSR Kadapa
గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు చదవడం మాకెంతో ఇష్టం
రామాపురం న్యూస్ డిసెంబర్ 20
రామాపురంలోని శాఖ గ్రంథాలయంలో చదవడం -మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని ఆదివారం గ్రంథాలయ అధికారి సూర్యనారాయణ రెడ్డి కన్నుల పండువగా నిర్వహించారు మూడవ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చదవడం మాకిష్టం అనే కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలోని విద్యార్థులు గ్రంథాలయ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు స్థానిక గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి అని ఆయన అన్నారు ఇలా చదవడం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ జ్ఞానము జ్ఞాపకశక్తి పెంపొందుతుందని ఏ విషయాన్నైనా చదవడం ఆసక్తి కలుగుతుందని ఆయన అన్నారు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని జ్ఞానాన్ని పెంపొందించుకునే దానికి గ్రంథాలయాలను తప్పక వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులువిద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.