గృహ నిర్మాణాల లక్ష్యాలను అధికమించాలి
పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ ఆదేశాలు
కలెక్టరేట్ సభాభవన్ లో , డిఆర్వో, కడప నగర కమీషనర్, హౌసింగ్ పీడి లతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవ రత్నాలు పెదలందరికి ఇల్లు పథకంలో నిర్మాణ పనుల్లో భాగంగా.. స్టేజీ కన్వర్షన్,ఎక్స్పెండించర్ లక్ష్యాలను అధికమించాలని ప్రక్రియను వేగవంతం చేయాలని.. ఆ మేరకు అధికారులందరూ నిబద్ధతతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సభాభవన్ లో డిఆర్వో వెంకటేష్ , నగర కమీషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, హౌసింగ్ పీడి కృష్ణయ్య లతో కలిసి.. జగనన్న హౌసింగ్ కాలనీల్లో గృహ నిర్మాణ పనులు, ఓటీఎస్, జగనన్న స్వచ్ఛ సంకల్పం పనుల పురోగతితో పాటు.. “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహణపై మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ, నేరుగా సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ… ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు.. ప్రజలకు సంతృప్త స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులందరూ నిబద్ధతతో పని చేయాలన్నారు. గ్రామాలు, వార్డుల పరిధిలో.. వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) ప్రక్రియ, స్టేజి కన్వర్షన్, డిజిటల్ సైనింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని లే అవుట్లలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. గృహనిర్మాణ పలనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని.. ఆదేశించారు. వారి వారి పరిధిలో ఉన్న లేవుట్ లలో ఏ ఏ సమస్యలున్నాయి, వాటి పరిష్కారం ఏంటి అన్నది ప్రతి అధికారికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సందర్భంగా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అన్నారు. చిత్త శుద్దితో పని చేసి పురోగతిని చూపాలని అన్నారు. ఆడిట్ ఆక్షేపణ లను వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు.
జిల్లాలో జగనన్న హౌసింగ్ పథకం.. ఎంత ప్రధాన్యతతో నిర్వహించడం జరుగుతుందో.. అంతే ప్రధాన్యతతో “జగనన్న స్వచ్ఛ సంకల్పం” కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా.. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో డ్రైనేజీ కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగింపు, దోమల నియంత్రణ చర్యలను పూర్తి చేయాలన్నారు. సచివాలయాల పరిధిలో ప్రతి ఇంట్లో విధిగా ఫీవర్ సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంతో భాగంగా.. పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న ఇళ్ల నుండి చెత్త సేకరణ కార్యక్రమంపై ఎంపిడివోలు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో ఎక్కడా కూడా చిన్న చెత్త కుప్ప కూడా కనిపించకూడదని.. ఈఓపిఆర్డిలు, ఎంపిడివోలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ.. ఉద్యోగ బాధ్యతలతో పాటు.. ఆరోగ్య భద్రత కూడా మీ చేతుల్లోనే ఉందని అధికారులకు సూచించారు. సచివాలయాల్లో బయోమెట్రిక్, సచివాలయ భవన నిర్మాణాలు, స్పందన అర్జీల పరిష్కారం వేగవంతం వంటి అంశాలపై యాక్షన్ ప్లాన్, పురోగతిపై.. సిహెచ్ఓలు, ఎంహెచ్ఓ లతో సమీక్షించారు.
స్పందన పోర్టల్, మీ-సేవా, ఏపీ సేవా పోర్టల్ లో ప్రతిరోజు విధిగా సర్వీసు రిక్వెస్టులను పరిశీలించి సంబందిత రిపోర్టులు, పరిష్కార నివేదికలను నమోదు చేయాలన్నారు. అంతే కాకుండా.. నాడు-నేడు పనులను ఎక్కడా కూడా నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా.. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. పనిదినాలను కల్పించడంలో జిల్లాకు నిర్దేశించిన రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
గడప వడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని.. మండల, నియోజకవర్గ ప్రత్యేకధికారులు.. బాధ్యతగా తీసుకుని.. సచివాలయాల వారీగా ఎమ్మెల్యేలు పర్యటించే వివరాలను.. వారం రోజుల ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సంబందిత కార్యక్రమానికి అవసరమైన, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలకు సంబందించిన కరపత్ర సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే విన్నపాలను నోట్ చేసుకుని.. వారి ఫోటోతో పాటు ఆ వివరాలను సంబందిత యాప్ లో క్రమం తప్పకుండా అప్ లోడ్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కడప, బద్వేలు, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ల.. ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, వెంకటరమణ, శ్రీనివాసులు లతో పాటు నియోజకవర్గ, మండల ప్రత్యేకధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడివోలు, హౌసింగ్, డ్వామా, డిఆర్డీఏ, పీఆర్ అధికారులు, ఇంజనీర్లు తదితరులు హాజరయ్యారు.