Andhra PradeshGunturKrishnaLatest NewsPrakasamTelangana
గుజరాత్ లో పట్టుకున్న హెరాయిన్ తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ గౌతమ్
సవాంగ్
ఇటీవల గుజరాత్ లో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ ను పట్టుకోగా, అక్రమ రవాణాదారులకు ఏపీతో లింకులున్నాయంటూ వార్తలొచ్చాయి. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ కు ఏపీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై డీఆర్ఐ నార్కొటిక్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని వెల్లడించారు.
ఈ అంశంలో విజయవాడను చిరునామాగా మాత్రమే వాడుకున్నారని, అంతకుమించి నగరంలో ఎలాంటి కార్యకలాపాలు లేవని సవాంగ్ వివరించారు. హెరాయిన్ ఘటనలో చెన్నై కేంద్రంగానే మొత్తం లావాదేవీలు జరిగాయని తెలిపారు. వాస్తవాలు ఇలావుంటే, సీఎం కార్యాలయానికి సమీపంలోనే ఇదంతా జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.