Andhra PradeshYSR Kadapa
కోవిడ్ వాక్సిన్ సురక్షితం సూపరింటెండెంట్ డాక్టర్. మధుసూదన్ రెడ్డి
పులివెందుల జనవరి 17
తొలి దఫా 5 రోజులు కోవిడ్ వాక్సిన్ లో భాగంగా 2వ రోజు ఆదివారం ఉదయం 9-50 ని. లకు సూపరింటెండెంట్ డాక్టర్. మధుసూదన్ రెడ్డి ఏ.ఎన్.ఎం చే వాక్సిన్ వేయించుకున్నారు. సిబ్బంది లో అపోహలు తొలగించి స్ఫూర్తి గా నిలవడం కోసం ముందుగా ఆయన వాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. మధుసూదన్ రెడ్డి రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్. దివ్య శ్రీ కి వేశారు. తరువాత ఆసుపత్రి సిబ్బంది హెడ్ నర్స్ లు, స్టాఫ్ నర్స్ లు శానిటేషన్ సిబ్బంది కి సూపరింటెండెంట్ చేతులమీదుగా వాక్సిన్ వేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమీషనర్ నరసింహ రెడ్డి, ఏ. ఎన్. ఎం వెంకటసుబ్బమ్మ, అంగన్వాడీ టీచర్ లావణ్య, ఆశా కార్యకర్త పద్మావతమ్మ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు