కోడి కత్తి కేంద్రాలపై పోలీసులు మెరుపుదాడులు
కృష్ణా మన జనప్రగతి న్యూస్ :- ఏపీలో సంక్రాంతి పండుగంటే ఆ సందడే వేరు.. సంక్రాంతికి రాష్ట్రమంతా ఒకటే కోలాహలం నెలకొంటుంది. బంధువులంతా వచ్చేస్తుంటారు. కొత్త అల్లుళ్లు కోడిపందేలతో ఆ కథే వేరుంటుంది. అయితే ఏది ఉన్నా లేకున్నా ఏపీలో సంక్రాంతికి అయితే కోడిపందేలు ఖచ్చితంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. కోర్టు నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ.. పోలీసులు స్టిక్ట్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పటికే బరులు ఏపీలో వ్యాప్తంగా సిద్ధమైనట్టు సమాచారం. కృష్ణా జిల్లాలో కోడి కంటే కత్తులు ఎక్కువగా తయారవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వరుసగా కోడి కత్తి కేంద్రాలపై పోలీసులు మెరుపుదాడులు చేస్తూ వందల సంఖ్యలో కోడికత్తులను స్వాధీనం చేసుకొని తయారీదారులను అరెస్టులు చేస్తున్నారు.కోడి పందాల నిర్వహణలో కత్తులే కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని కోళ్లకు కట్టి పందాలు నిర్వహించటమనేది నిషేధం. దీనిపై ఇప్పటికే కోర్టు నుంచి కూడా కీలక ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ వీటిని బేఖాతరు చేసి పందెం రాయుళ్లు కోడి పందాలను నిర్వహిస్తారు.కోడిపందేల్లో కీలకభూమిక పోషించేది మాత్రం కత్తులే కావటంతో కృష్ణాజిల్లా పోలీసులు కోడి కత్తులపై ఫోకస్ పెట్టారు. కోడి కత్తులు కొనే వారు వాటిని తయారు చేసే వారిని గుర్తించి పట్టుకుంటే పందెం రాయుళ్ళను కూడా పట్టుకోవటం తేలికని గుర్తించిన పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్ లో భారీగా కోడి కత్తులు పట్టుబడుతున్నాయి
..