కువైట్లో మృతి చెందిన జి కె రాచపల్లి వాసి
సుండుపల్లె న్యూస్ జనవరి 19
మండల పరిధిలోని జికె రాచ పల్లెకు చెం దిన రెడ్డప్పరెడ్డి( 50) అనారోగ్యంతో సోమవారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లి అక్కడ పనులు చేసుకుంటూ ఇటీవల లాక్డౌన్ సమయంలో ఇంటి దగ్గరే ఉన్న సుబ్బారెడ్డి గత నెలలో తిరిగి కువైట్ కు వెళ్లాడని అక్కడ అనారోగ్యంతో ఉండటంతో అతనికి మందులు పంపించేందుకు కోసం అతని తండ్రి సుబ్బారెడ్డి గత నాలుగు రోజుల క్రితం చిత్తూరు జిల్లా లోని మా హాల్ కు వెళ్తూ మార్గం మద్యంలోనే కేవీపల్లి మండలం చీనేపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు ఈ విషయం తెలుసుకున్న రెడ్డప్పరెడ్డి ఇంకా నీరసించి కువైట్లో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు మృతిచెందిన రెడ్డప్పరెడ్డికి భార్యతో పాటు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని గ్రామస్థులు తెలిపారు దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని మందుల కోసం వెళ్తూ తండ్రి మరణించడం తో శోక సముద్రంలో మునిగిపోయిన కుటుంబంలో మరో విషాదం జరగడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు