Andhra PradeshChittoorLatest NewsPoliticalSports
కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేపట్టారు. టీడీపీ నేత మురళీ పై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.
పోలీసుల తీరును నిరసిస్తూ కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. మురళీపై దాడి చేసిన సెంథిల్ ను పట్టుకోవటంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కుప్పం పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
టీడీపీ నేత మురళీ పై దాడి చేసిన వైసీపీ నేత సెంథిల్ ను అరెస్ట్ చేయాలంటూ కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులను అరెస్ట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ టీడీపీ కార్యకర్త పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేశాడు.