కుక్కల దాడిలో 72 గొర్రె పిల్లలు మృతి
సుండుపల్లె మన జనప్రగతి ఏప్రిల్ 01:-
కుక్కలు గొర్రెల పై స్వైర విహారం చేయడంతో 72 గొర్రె పిల్లలు మృతి చెందినట్లు గొర్రెల కాపరి చుక్క వెంకటరమణ తెలిపారు సుండుపల్లె మండలంలోని రాయవరం గ్రామపంచాయతీ దేవాండ్ల పల్లి కి చెందిన చుక్క వెంకటరమణ దేవాండ్ల పల్లికి పడమర భాగంలో మామిడి తోటలో ఉండగా మేస్తున్న గొర్రెల మందపై కుక్కలు స్వైర విహారం చేశాయి అని తెలిపారు
ఒక్కసారిగా కుక్కలు మందపై పడి గొర్రె పిల్లలు, గొర్రెల పై దాడి చేయగా భారీగా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. 30కి పైగా గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయని ఈ విషయాన్ని పశు వైద్య అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వైద్యాధికారులు వాటిని పరిశీలించి నష్ట నివారణ పథకం కింద ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందేటట్లు చూస్తామని తెలిపారు. ఒక్క సారిగా ఈ విధంగా నష్టం వాటిల్లడంతో గొర్రెల కాపరి తల పట్టుకున్నాడు ప్రభుత్వం నుండి తనను ఆదుకోవాలని లబోదిబో అని వేడుకుంటున్నారు