HyderabadRangareddyTelangana
కుక్కల దాడిలో 48 గొర్రెలు మృత్యువాతపడ్డాయి
రంగారెడ్డి మన జనప్రగతి న్యూస్:- జిల్లాలో కుక్కల బీభత్సం సృష్టించాయి. కుక్కల దాడిలో 48 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన జిల్లాలోని ఆమనగల్ మండలం మేడిగడ్డతండాలో చోటు చేసుకుంది. గొర్ల యజమాని మేత కోసం మేడిగడ్డతండాకు తీసుకువెళ్తుండగా ఒక్కసారిగా గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో 48 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.5లక్షలుగా చెబుతున్నారు. గొర్రెల మృతితో యజమాని తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు.