Andhra PradeshLatest NewsPoliticalSportsYSR Kadapa
కార్యకర్త మృతికి నివాళులు అర్పించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
కార్యకర్త మృతికి నివాళులు అర్పించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
రామాపురం మన జనప్రగతి జూలై 27
రామాపురం మండలం నల్లగుట్టపల్లె బీసీ కాలనీ కి చెందిన దేవపట్ల రామరాజు (40)ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందారు. మంగళవారం బీసీ కాలనీలో జరిగిన రామరాజు అంత్యక్రియలలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించి అతని మృతిపట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులను, వారి సోదరుడు శేఖర్ ను ఆయన పరామర్శించారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, సర్పంచ్ నాగభూషన్ రెడ్డి, యువజన విభాగపు రాష్ట్ర కార్యదర్శి సూరం వెంకట సుబ్బారెడ్డి, ఓబులేసు, కె పి ఆర్ పెంచల్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు నివాళులు అర్పించారు.