కాపులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
- కడప జనవరి మన జనప్రగతి 07:-
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేస్తున్నారు. రిజర్వేషన్లు ఎత్తేసి సామాజిక ఆర్థిక ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూన్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి. హరిప్రసాద్ మండి పడ్డారు.
గురువారం కడప నగరంలోని హరి టవర్స్ లో మీడియా సమావేశంలో హరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులు, హత్యలుపెరిగిపోయాయన్నాయని ఆరోపించారు. 18 నెలల పాలనలో 40 మంది కాపు నాయకులపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని బాధ వ్యక్తం చేశారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్ల పాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులును పాశవికంగా హత్య చేశారని పేర్కొన్నారు.
వైస్సార్ కాపు నేస్తం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ..15 వేలు చొప్పున ఐదేళ్ళల్లో 75 వేలు ఆర్థిక సాయం చేస్తానని సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో సుమారుగా కోటి మంది పైగా కాపులున్నట్లు పేర్కొన్న.. వైసీపీ ప్రభుత్వం కాపు నేస్తాన్ని మాత్రం 2.35 లక్షల మందికి పరిమితం చేసి కాపులను నిలువునా ఉంచారని ధ్వజమెత్తారు.
కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం ద్వారా విద్య ఉద్యోగ రంగాల్లో అవకాశాలను దూరం చేశారాని రాష్ట్ర ప్రభుత్వం పై హరి ప్రసాద్ విరుచుకుపడ్డారు.
కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకు అందాల్సిన 45 వేల రుణాలను రద్దు చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను దెబ్బ తిసారన్నారని బాధను వ్యక్తం చేశారు. కాపులకు కేటాయించిన 2 వేల కోట్లల్లో రూ 442 కోట్లను అమ్మ ఓడి కోసం మళ్లించి కాపులకు అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో కల్పించిన రిజర్వేషన్లు ఎత్తి వేయడానికి ఇంత వరకు స్పష్టమైన కారణం ప్రభుత్వం ప్రకటించే లేదన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపి శెట్టి నాగరాజు,సంఘం జిల్లా కార్యదర్శులు మిరియాల నరసింహులు,ములికినాటి రామాంజనేయులు,చెన్నమిశెట్టి రామచంద్రయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.