కాంగ్రెస్ నేతలపై చంద్రబాబు గురి

అమరావతి మార్చి 04:-ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజానాథ్ అలాగే తులసి రెడ్డి వంటి నేతలు బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరితో కూడా కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళతో భారతీయ జనతా పార్టీ చర్చలు జరిగినా సరే పెద్దగా ఫలితం కనపడడం లేదు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. తులసిరెడ్డి మాట్లాడే మాటలకు మీడియా వర్గాలు కూడా కాస్త ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి.
కడప జిల్లా రాజకీయాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.అమరావతి ఉద్యమానికి ఆయన మద్దతు ఇస్తూనే ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు తులసి రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు కూడా ఈ మధ్యకాలంలో వ్యాఖ్యలు చేసాయి. ఇప్పుడు తులసిరెడ్డి కోసం భారతీయ జనతాపార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
ఆయనకు వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంటు సీటు ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీ రెడీ అయిందట. గతంలో ఎమ్మెల్సీగా మాత్రమే పని చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు కడప పార్లమెంటు సీటు ఆఫర్ చేయడం వలన వచ్చే ఉపయోగం ఏమీ లేదు. అయితే కడప జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి సీటు ఇస్తామని కూడా భారతీయ జనతా పార్టీ చెప్పిందట. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని ఈ నేపథ్యంలోనే మీకు కడప పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ స్థానం నుంచి అని చెప్పినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఏమంటారో చూడాలి.