Andhra PradeshKurnoolLatest NewsTelangana
కర్నూలు నుంచి 3విమాన సర్వీసులు

మార్చి 28 నుంచి ఇండిగో ప్రారంభం
ఓర్వకల్లు, న్యూస్‌టుడే: కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైలకు మార్చి 28నుంచి విమాన సర్వీసులను నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రాంతీయ అనుసంధానత పథకం ‘ఉడాన్’ కింద వీటిని సరాసరి నడపనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మూడు మార్గాల్లో వారానికి నాలుగుసార్లు విమానాలను నడపనున్నట్లు వివరించింది. ఏపీ న్యాయ రాజధానిగా కర్నూలు ఆవిర్భవించనున్న నేపథ్యాన్ని, హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక నడవా ఏర్పడనున్న క్రమాన్ని విమానయాన సంస్థ ప్రకటన ప్రస్తావించింది దీని వల్ల పర్యాటకులకే కాకుండా ప్రభుత్వ అధికారులకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడింది.