Andhra PradeshCrimeEast GodavariKurnoolLatest NewsTelangana
కర్నూలు నగరంలో విషాదం

కర్నూల్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వడ్డెగేరిలో విషం తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీవీ మెకానిక్ ప్రతాప్(42), హేమలత(36) దంపతులు తమ పిల్లలు జయంత్(17), రిషిత(14)తో కలిసి వడ్డెగేరిలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికెళ్లి చూడగా నలుగురూ విగతజీవులై కనిపించారు. ఘటనాస్థలి వద్ద పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కరోనా కారణంగా బంధువులు, స్నేహితులు చనిపోయారన్న మనస్తాపంతో విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్‌నోట్‌లో వారు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.