Andhra PradeshAnanthapurChittoorLatest NewsTelanganaYSR Kadapa

కర్ణాటకలో మరో వింత వ్యాధి

గత ఏడాది కరోనా మహమ్మారి దెబ్బకు అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైరస్ బారిన పడి ప్రత్యక్షంగా కొంతమంది.. వైరస్ సృష్టించిన భయంతో మరికొంతమంది విలవిలలాడిపోయారు. కరోనా చాలా మంది జీవితాలను తారుమారు చేసింది. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. మరెంతోమంది మానసిక క్షోభను అనుభవించారు. అయితే ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. కానీ కరోనా కేసులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మనకు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మరో వింత వ్యాధి కలకలం సృష్టిస్తున్నది. అదే మంకీ వైరస్.

ఆ భయంకరమైన వ్యాధిపేరు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD). దీన్ని మంకీ ఫీవర్ (Monkey fever)అని కూడా పిలుస్తారు.

 అయితే ఈ మహమ్మారిని కర్ణాటకలోని శివమొగ్గలో గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కోతుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని డాక్టర్లు అంటున్నారు.

క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్.. కోతుల నుంచి మనుషులకు సోకుతుంది. మొదట్లో ఈ వ్యాధి  కేరళలో వెలుగుచూసింది. చిన్నగా కర్ణాటకకు వ్యాపించింది. మొదట కేరళ- కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉండే వాయనాడ్ జిల్లాలో తొలిసారిగా దీన్ని గుర్తించారు.  ఈ వ్యాధి గతంలోనూ  పలుమార్లు వచ్చింది.

2019 2020లో ఈ వ్యాధి విజృంభించింది. అప్పట్లో కర్ణాటక కేరళలోని మొత్తం 12 జిల్లాల్లో ఈ మహమ్మారి కనిపించింది.  కర్ణాటకలో మంకీ ఫీవర్ విజృంభిస్తోన్నట్లు అధికారులు అలర్టయ్యారు. పరీక్షలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే  దాదాపు 2500 మందికి పరీక్షలు నిర్వహించిట్టు వైద్య సిబ్బంది తెలిపారు. శివమొగ్గ జిల్లాలో ఇద్దరికి.. మల్నాడ్ రీజియన్లో మరో ఇద్దరికి మంకీ ఫీవర్ సోకింది.  చిక్మగళూరు జిల్లా ఎన్ఆర్ పుర తాలూకాలో మరో కేసు వెలుగులోకి వచ్చింది.

లక్షణాలు..

జలుబు జ్వరం తలనొప్పి కండరాల నొప్పి వాంతులు కడుపు ఉబ్బరం రక్తస్రావం లో బీపీ ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం ఎర్ర రక్తకణాలు క్షణించడం వంటి మంకీ ఫీవర్ లక్షణాలని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.సాధారణ వైద్యం ద్వారా కోలుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు.

వ్యాధి ముదరక ముందే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మరితో జనాలు అతలాకుతలం అవుతుంటే .. మంకీ ఫివర్ రూపంలో మరో ముంపు ముంచుకొచ్చిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అయితే ఈ వ్యాధి అటవీ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ఆయా చోట్ల వైద్య సిబ్బంది క్యాంపులు నిర్వహిస్తున్నారు.

Mana Jana Pragathi

Mana Jana Pragathi is one of the Best Telugu Daily News Paper. Readers get the latest information around the world on time from their mobile device. Readers can browse category wise news like political, cinema, education and sports etc. Readers can browse daily paper at our paper portal.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected a AdBlocker on your browser, please add us for the exemption to support us.