కరోనా కొత్త కేసుల సంఖ్య 1,17,000
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉంది. అమెరికా, యూరోప్ దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇక భారత్ లోనూ కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి.రోజువారీ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోయింది. డిసెంబర్ చివరి వారం వరకు సరాసరి రోజువారీ కేసుల సంఖ్య 10,000 మార్క్ వద్ద ఉండగా.. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ సంఖ్య లక్షకు చేరింది. గురువారం దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కొత్త కేసుల సంఖ్య 1,17,000 ఉండగా, బుధవారం ఆ సంఖ్య 90,889 ఉంది. బుధవారం కేసుల శాతం కంటే గురువారం 29శాతం కరోనా కేసులు పెరిగాయి. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉంది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగానే ఈ స్థాయిలో కేసులు ఇదిలాఉంటే దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. చివరగా 2021 జూన్ 6న దేశంలో లక్ష కేసులు నమోదు అయ్యాయి. అనంతరం తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు డిసెంబర్ రెండో వారానికి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. తిరిగి ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇది మొదటి దశ కంటే ఐదు రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు వైద్యశాఖ తెలిపింది. అయితే ప్రస్తుత దశలో మరణాల రేటు అదుపులోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్త కేసుల పెరుగుదలతో దేశ వ్యాప్తంగా క్రియాశీలక కరోనా కేసులు 3.5 లక్షలు దాటేసింది. ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.