Andhra PradeshCrimeLatest NewsPoliticalTelangana
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం చెందారు. పునీత్ రాజ్కుమార్ హార్ఎటాక్తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఉదయం జిమ్ వర్కౌట్ చేస్తుండగా రాజ్కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే పునీత్ను బెంగళూరు విక్రం ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ కాపాడే ప్రయత్నం చేశారు వైద్యులు. అయితే, తాము ఎంత ప్రయత్నించినా పునీత్ను కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు. గుండెపోటు కారణంగానే రాజ్కుమార్ చనిపోయినట్టు వైద్యుల ప్రకటించారు. కాసేపట్లో రాజ్కుమార్ మరణవార్తను అధికారికంగా ప్రకటించనున్నారు.