కడప.. సిబిఐఅధికారులను కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీత

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 73 వ రోజు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించిన సిబిఐ అధికారులు… బుధవారం కడప కేంద్ర కారాగారం అతిథి గఅహంలో సునీల్యదవ్ సమీప బంధువు భరత్ యాదవను విచారిస్తున్నారు. ఈ క్రమంలో నేడు వివేకా కుమార్తె సునీత కడపలో సిబిఐ అధికారులను కలిశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పులివెందులలో గత రెండు రోజులుగా వైఎస్ కుటుంబ సభ్యులను సిబిఐ విచారించింది. ఈ నేపథ్యంలో తన తండ్రి హత్యకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిశాయా ? అని తెలుసుకునేందుకు సునీత సిబిఐ అధికారులను కలిసినట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసుకు సంబంధించి భరత్ యాదవ్తో పాటు పులివెందుల ప్రాంతానికి చెందిన మహబూబ్ బాషా, నాగేంద్రతో సహా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న మరో వ్యక్తి విచారణకు హాజరయ్యారు. ఓ పోలీస్ కానిస్టేబుల్, గతంలో వివేకా పొలం పనులు చూసిన సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్రెడ్డిని కూడా సిబిఐ విచారణకు పిలిచినట్లు సమాచారం. పులివెందుల ఆర్అండ్బ అతిథి గఅహంలో ఎంపి అవినాష్ తండ్రి భాస్కర్రెడ్డి, చిన్నాన్న మనోహర్రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సిబిఐ బఅందం ఇవాళ మరోసారి విచారణకు పిలిచింది