కడప ప్రజలకు బంపరాఫర్: రూ.926తో విమానంలో జాలీగా,
కడప ప్రజలకు బంపరాఫర్: రూ.926తో విమానంలో జాలీగా, ఎక్కడికైనా.. వివరాలివే!
వైఎస్సార్ కడప జిల్లా ప్రజలకు ట్రూజెట్ విమాన సంస్థ అదిరిపోయే గణతంత్ర దినోత్సవ ఆఫర్ ప్రకటించింది. కడప నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాల ప్రారంభ ధర రూ.926గా నిర్ణయించినట్లు కడప ట్రూజెట్ మేనేజర్ భవ్యన్‌కుమార్ వెల్లడించారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ మధ్యలో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిసుందని వెల్లడించారు. ఇలా బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 30వ తేదీ మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుందని వివరించారు.కొన్ని విమాన సర్వీసులు ప్రతి రోజు ఉండగా, మరికొన్ని సర్వీసులు ఆయా రోజుల్లో సూచించిన విధంగా కడప నుంచి బయల్దేరుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించి తమ టిక్కెట్లను బుకింగ్ చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. కడప నుంచి లిస్టులో పేర్కొన్న ఏ సిటీకైనా విమాన ప్రారంభ ధర రూ.926గా ఉంటుందని వెల్లడించారు.
కడప నుంచి విమానాల రాకపోకల సమయాలు..
కడప To బెల్గాం:మధ్యాహ్నం 2.25 – 3.25 (మంగళ, గురు, శనివారం)కడప To బెల్గాం : సాయంత్రం 3.30 – 4.55 (సోమ, బుధ, శుక్ర, ఆదివారం)
బెల్గాం To కడప : మధ్యాహ్నం 1.55 – 3.10 (సోమ, బుధ, శుక్ర, ఆదివారం)
బెల్గాం To కడప : ఉదయం 9.20 – 10.40 (మంగళ, గురు, శని)
కడప To హైదరాబాద్ : ఉదయం 11.00 – 12.15 (మంగళ, గురు, శనివారం)హైదరాబాద్ To కడప : మధ్యాహ్నం 12.45 – 01.40 (మంగళ, గురు, శనివారం)
కడప To చెన్నై : మధ్యాహ్నం 02.00 – 03.00 ( ప్రతి రోజు)
చెన్నై To కడప : ఉదయం 10.05 – 11.10 (ప్రతి రోజు)
కడప To విజయవాడ : ఉదయం 11.30 – 12.20 (ప్రతిరోజు)
విజయవాడ To కడప : మధ్యాహ్నం 12.40 – 01.40 (ప్రతి రోజు)