కడప నగరంలో కర్ఫ్యూ అమలును పరిశీలించిన జిల్లా ఎస్పీ
అత్యవసరమైతేనే బయటకు రావాలి.. అనవసరంగా రోడ్లపై తిరగవద్దని ప్రజలకు సూచన..
కడప మన జనప్రగతి మే 09:-
జిల్లా కేంద్రమైన కడప నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పర్యటించి కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని పరిశీలించారు. ఇందులో భాగంగా 7 రోడ్ల కూడలి, పాత బస్ స్టాండ్, కోటిరెడ్డి సర్కిల్, ఎర్రముక్క పల్లి ప్రాంతాల్లో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. ఎర్రముక్కపల్లి సర్కిల్ వద్ద రోడ్డు పై వెళుతున్న వాహనదారులను నిలిపి ఎక్కడికి, ఏ పని నిమిత్తం వెళుతున్నదీ.. ఆరా తీశారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు/ సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్.పి వెంట కడప వన్ టౌన్ సి.ఐ టి.వి సత్యనారాయణ ఉన్నారు