కడప జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజద్ భాష.
కడప జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజద్ భాష.
రూ.34 లక్షలతో నగరంలోని స్థానిక 22 వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
కడప, ఫిబ్రవరి 6 : కడప జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్బాష పేర్కొన్నారు. శనివారం స్థానిక 22వ డివిజన్ మృత్యుంజయ కుంట, మారుతి నగర్ కాలనీ పరిధిలో రూ.34 లక్షలతో నూతన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి.అంజాద్బాష, కడప పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ మేయర్ కె.సురేష్ బాబుతో కలసి శంకు స్థాపన చేశారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజద్ బాష మాట్లాడుతూ కుల,మత, వర్గ ,పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే అన్నారు. ముఖ్యమంత్రి కడప జిల్లావాసి కావడం మన జిల్లా ప్రజల అదృష్టమన్నారు. రూ.54 కోట్ల తో కడప నగరంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఉపముఖ్యమంత్రి మృత్యుంజయ కుంటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల స్సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మృత్యుంజయ కుంటలోని మసీదుకు ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలాలలో చెత్త నింపు తున్నారని దీని వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యాలు గురవుతున్నారని వీటిని వెంటనే ఇక్కడ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వినతిపత్రం అందించారు. అనంతరం తాగునీటి సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.ఈ కార్యక్రమంలో 22 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బోలా పద్మావతి, 30 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షఫీ, 37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బసవరాజు, వైసీపీ మహిళా నాయకులు పత్తి రాజేశ్వరి, రత్నకుమారి, వెంకట సుబ్బమ్మ, స్థానిక నాయకులు దాసరిశివ, అహమ్మద్ ఖాన్, మనోజ్ కుమార్, బోలా జయరాం, రామకృష్ణయ్య, కృష్ణమూర్తి, శివయ్య, దేశి మునిస్వామి, రాజసాబ్, ఖాసీం సాబ్, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.