Cinema
కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, సూపర్ స్టార్ మమ్ముట్టి ఒకే ఫ్రేములో
కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, సూపర్ స్టార్ మమ్ముట్టి ఒకే ఫ్రేములో కనిపిస్తే కనువిందుగా ఉంటుంది. ఇది వారి అభిమానులకే కాదు, సినీ ప్రియులకు కూడా చూడముచ్చటగానూ ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని తాజాగా మోహన్‌లాల్ అభిమానులతో పంచుకున్నారు. అనేక వార్తలను క్రియేట్ చేశారు.మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలాంటివారు. రెండు పిల్లర్లు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇద్దరు సూపర్ స్టార్లు మంచి స్నేహితులు. సినిమాలకు అతీతంగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలిసి పలు సినిమాల్లోనూ నటించారు. తాజాగా ఊహించని విధంగా వీరు ఒకే ఫ్రేములో కనిపించడం అభిమానులను సంబరానికి గురి చేస్తుంది.