ఒక రోజు హోంమంత్రిగా
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్ మినాక్షి వర్మని ఒక రోజు హోంమంత్రిగా నియమించారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్వయంగా తన కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి ఆమెకు తన బాధ్యతలను ఒకరోజు బదిలీ చేశారు. ఈ రోజు మినాక్షి చెప్పినట్లుగానే హోంశాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.
సోమవారం భోపాల్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ”మీనాక్షి ఈరోజు హోంమంత్రిగా ఉంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. నా కుర్చీని మీనాక్షికి ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను. ఈ ఒక్కరోజు హోంశాఖ పూర్తిగా మీనాక్షి ఆదేశాల మేరకే పని చేస్తుంది” అని హోంమంత్రి నరోత్తమ్ అన్నారు.ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు బరేలీ ఎయిర్‌పోర్టు ప్రారంభంకానుంది. ఈ ఎయిర్ పోర్టులో పైలెట్లు మొదలుకొని క్రూ సిబ్బంది వరకూ అందరూ మహిళలే ఉండనున్నారు.