Andhra PradeshCrimeKurnoolLatest NewsTelangana

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి ఆత్మహత్య కి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఈ దారుణమైన ఘటనలు నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.  నంద్యాల మాల్దార్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో పాటు దంపతులు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే ..నంద్యాల  నడిగడ్డ సమీపంలోని మల్దార్ పేట లో ఓ కుటుంబం ఇద్దరు పిల్లలతోపాటు నివాసం ఉంటున్నారు. ఈ  దంపతులు పిల్లలతో పాటుగా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి  చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే నలుగురు ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతి చెందిన వారు శేఖర్ కళావతి అంజలి అఖిల గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బంధువులని ప్రశ్నిస్తున్నారు.  ఆర్థిక సమస్యలతోనే ప్రాణాలు తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Mana Jana Pragathi

Mana Jana Pragathi is one of the Best Telugu Daily News Paper. Readers get the latest information around the world on time from their mobile device. Readers can browse category wise news like political, cinema, education and sports etc. Readers can browse daily paper at our paper portal.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected a AdBlocker on your browser, please add us for the exemption to support us.