Andhra PradeshLatest NewsTelanganaYSR Kadapa
ఒంటిమిట్ట కోదండ రాముని దర్శించుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్
కడప జనవరి 30 :- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . శనివారం ఉదయం ఒంటిమిట్ట కోదండ రాముని దర్శించుకున్నారు. టిటిడి వేద పండితులు పూర్ణకుంభంతో రమేష్ కుమార్‌కు స్వాగతం పలికారు. అభిషేకంలో పాల్గొని సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ కార్గ్, డిఎస్‌పి శివ, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్, కర్నూలు రేంజ్ ఐజి వెంకట్రామిరెడ్డి, ఎస్పీ అన్బురాజన్, సబ్ కలెక్టర్ పృథ్వి తేజ్ లు రమేష్ కుమార్‌కు పూల మొక్కలను ఇచ్చి స్వాగతం పలికారు.