ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్

దేశంలోని కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అసోం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ సునీల్ అరోరా ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో షెడ్యూల్ విడుదల చేశారు.ఏపీలోని తిరుపతి లోక్ సభ సీటుకూ తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికలను సైతం ఇందులోనే నిర్వహిస్తున్నారు.ఈ సారి కఠిన నిబంధనలు పొందుపరిచారు. రోడ్ షోలు బహిరంగ సభలు కోవిడ్ నిబంధనల ఆధారంగా నిర్వహించేలా.. ఇంటింటి ప్రచారానికి ఐదుగురు మాత్రమే అనుమతించేలా చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ముగించి.. చివరి గంట కరోనా బాధితులకు ఓటింగ్ వేసేందుకు అవకాశం కల్పించారు.పశ్చిమ బెంగాల్ శాసనసభలోని 294 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే తమిళనాడులో 234 కేరళ 140 అసోం 126 పుదుచ్చేరి 30 అసెంబ్లీ సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కోడ్ కూడా ఈ ఐదు రాష్ట్రాలు ఆయాన అసెంబ్లీ స్థానాల్లో వచ్చేసింది
.
పశ్చిమ బెంగాల్ శాసనసభలోని 294 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే తమిళనాడులో 234 కేరళ 140 అసోం 126 పుదుచ్చేరి 30 అసెంబ్లీ సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కోడ్ కూడా ఈ ఐదు రాష్ట్రాలు ఆయాన అసెంబ్లీ స్థానాల్లో వచ్చేసింది.