Andhra PradeshLatest NewsPoliticalTelangana
ఏలూరు కార్పొరేషన్ లో పూర్తయిన ఓట్ల లెక్కింపు… 47 డివిజన్లలో ఎదురులేని ycp
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, 47 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 3 డివిజన్లు టీడీపీకి దక్కాయి. గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించగా, 44 డివిజన్లలో వైసీపీ విజయభేరి మోగించింది.
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క డివిజన్ లోనూ గెలుపు దక్కలేదు. అధికార వైసీపీ ధాటికి విపక్ష టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఏలూరు కార్పొరేషన్ ఫలితాల ద్వారా స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం మరోమారు స్పష్టమైంది.