Andhra PradeshLatest NewsPoliticalTelanganaWest Godavari
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆ దేశం

: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశంపై 40పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఎన్నికలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీలపై తీర్పు రిజర్వు
అంతకుముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. గతేడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు.