Andhra PradeshPoliticalTelangana
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. ఫిబ్రవరి 5న తొలిదశ, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.