Andhra PradeshLatest NewsPoliticalTelangana
ఏపీలో నాలుగో విడత ముగిసిన ఎన్నికల ప్రచారం

ఏపీలో ఇప్పటికే మూడు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా, ఎల్లుండి చివరిదైన నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నేటి సాయంత్రంతో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 21వ తేదీ ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అయ్యే పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.కాగా, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ చేపడతారు. 3,299 పంచాయతీలు… 33,435 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాతీయలకు, వార్డులకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.