ఏపీలో ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్లులు
శ్రీకాకుళం మన జనప్రగతి :-
ఏపీలో ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీ ఖరారైంది. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం జనవరి 4 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ కులపతి కేసీరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రతిభ చూపిన విద్యార్థుల జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు. ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు సంబంధించి ఇడుపులపాయలో కళాశాలల్లో.. శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్‌ఐటీలకు, నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కేసీరెడ్డి వివరించారు ప్రతీ సంవత్సరం పది పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పది పరీక్షలు జరగలేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహించిన అధికారులు ఫలితాలను సైతం విడుదల చేశారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.