Andhra PradeshAnanthapurChittoorCinemaEast GodavariGunturKrishnaKurnoolLatest NewsLife StyleNellorePrakasamSrikakulamTelanganaVisakhapatnamVizianagaramWest GodavariYSR Kadapa
ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు, 37 మంది మృతి
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 11 వేల 698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 37 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 10 లక్షల, 18 వేల 031 మంది కరోనా బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, పశ్చిమగోదారి జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ఇక గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ పట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.