ఏపీలో కేసీఆర్ వచ్చే హక్కు లేదు సోము వీర్రాజు కామెంట్స్.

నెల్లూరు
కె.సి.ఆర్.జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టారు. ఈ పార్టీ పెట్టె హక్కు కె.సి.ఆర్ కు లేదు. ఆంధ్రులను పాలేగాళ్ళు..ద్రోహులు గా వర్ణించారని బీజేపీ రాష్ట్ర ఛీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. అలాంటి కె.సి.ఆర్ కు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత లేదు. ఇలాంటి నేత జాతీయ పార్టీ ఎలా పెడతారు. ఆర్ ఎస్ ఎస్.అధినేత పై కె.టి ఆర్.వ్యాఖ్యలు సరికాదు. ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కె.సి ఆర్.కు కూడా మతి భ్రమించింది. కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకుందని అన్నారు. తెలంగాణా లో టీఆర్ ఎస్ ఓటమి పాలు కానుంది. ఎన్నికల తర్వాత బి.ఆర్.ఎస్.త్వరలోనే వి.ఆర్.ఎస్. తీసుకోవాల్సి ఉంటుంది. అమరావతి లోనే రాష్ట్ర రాజధాని ఉండాలి. బెంగళూరు నుంచి అమరావతి కి ఆరు వరుసల రహదారిని కూడా కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజదాని పై మమకారం లేదు. ఎన్నికల అంశంగా ప్రభుత్వం మారుస్తోందని అన్నారు.