Andhra PradeshLatest NewsTelangana
ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా బీభత్సం… మరో 71 మంది మృత్యువాత
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ విశృంఖలంగా కొనసాగుతోంది. కరోనాతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. గడచిన 24 గంటల్లో 71 మంది కరోనాకు బలయ్యారు. అదే సమయంలో 74,748 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,669 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అటు దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతికి అడ్డుకట్టపడడంలేదు. నిత్యం 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వస్తుండడంతో భయానక పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య 50 వేల వరకు నమోదవుతోంది. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం తెలిసిందే.