Andhra PradeshAnanthapurChittoorEast GodavariEducationGunturKrishnaKurnoolLatest NewsNellorePoliticalPrakasamSrikakulamTelanganaVisakhapatnamVizianagaramWest GodavariYSR Kadapa
ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను నేడు విడుదచేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. .. మార్చి 15న ఎన్నిక జరుగుతుంది. మార్చి 4 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు, మార్చి 5 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మార్చి 8న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. మార్చి 15న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. మార్చి 29 తోనలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.తిప్పే స్వామి, సంధ్యారాణి, వీర వెంకన్న చౌదరి, మహ్మద్ ఇక్బాల్ పదవీకాలం పూర్తి అవుతుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగ నున్నాయి.