Andhra PradeshChittoorGuntur
ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్
అమరావతి: రేపే ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉంటే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై గతంలో ఎస్‌ఈసీ సీరియస్ అయ్యారు. ఏకగ్రీవాలను ప్రకటించొద్దని కలెక్టర్లకు ఆదేశించారు. తాజాగా ఈ రెండు జిల్లాలపై కీలక నిర్ణయం తీసుకుంది. రెండు జిల్లాల ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గుంటూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్నికల కమిషన్ సమాచారం అందించింది. రేపోమాపో ఏకగ్రీవం అయిన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇచ్చే అవకాశం ఉంది.