ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రెండో రోజు భేటీ
గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రెండో రోజు భేటీ అయ్యారు.ఈ భేటీలో టీడీపీ తరుపున మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కల్లు రవీంద్ర,విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురామ్, సీపీఐ తరుపున అక్కినేని వనజ, జల్లి విల్సన్ జనసేన తరపున అక్కల గాంధీ పాల్గొన్నారు. వీరి అభిప్రాయాలు, సలహాలను నిమ్మగడ్డ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ ఎలాంటి వివక్ష లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగిందని ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాల న్నారు. మార్చి 5లోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ చేపట్టాలని. ఎన్నికల విధుల్లో వలంటీర్లు పాల్గొనకూడదని. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొంటే క్రిమినల్ చర్యలు తప్పవని మరోసారి హెచ్చరిం చారు.ప్రభుత్వ విధుల్లో వాలంటీర్లు పాల్గొనవచ్చు. డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని. త్వరలోనే నామినేషన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.