ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై ఆరోపణలు పూర్తి అవాస్తవము
ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై టిడిపి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇటీవల చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఆదివారం పాయకరావుపేటలో జరిగిన విలేకర్ల సమావేశంలో చిక్కాల మాట్లాడారు. అనిత ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో చేసిన అవినీతి అక్రమాలు నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. అభివఅద్ధి అజెండాగా పని చేస్తున్న ఎమ్మెల్యే బాబురావుపై అవినీతికి మారుపేరుగా నిలిచిన అనిత విమర్శలకు దిగడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తన పాలనలో ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి తిరిగి అమ్మేసి నిధులు కొట్టేసిన ఘనత అనితదని విమర్శించారు.రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేయడం, విద్యుత్ లైన్‌మెన్ పోస్టుల్లో అక్రమాలకు పాల్పడడం, ఇసుక తవ్వకాలు ప్రోత్సహించి కోట్లాది రూపాయలు అనిత అర్జించారని విమర్శించారు. అనిత పాలనంతా కేవలం శంకుస్థాపన పరిమితమైందని, నియోజకవర్గంలో ఒక అభివఅద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని అన్నారు. 30 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మంజూరు చేయించి ప్రజల కలను నెరవేర్చారని గుర్తుచేశారు. నియోజవర్గంలో కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి అనేక అభివఅద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పట్టణ శాఖ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, పాయకరావుపేట నామవరం పిఎసిఎస్ చైర్మన్లు వంగలపూడి రామారావు, తోట సత్యకిరణ్, పార్టీ సీనియర్ నాయకులు గెడ్డమూరి శ్రీనివాస రావు, గూటూరు వెంకటేశ్వరరావు, బోడపాటి గోవిందు తదితరులు పాల్గొన్నారు.