ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ పరిధిలోని మాలూరా పరింపొర ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో పాకిస్థాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ నదీం అబ్రార్ హతమయ్యాడు.శ్రీనగర్ జాతీయ రహదారిపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్ పీఎఫ్ జవాన్లు మోహరించారు.పరింపొరా వద్ద జవాన్లు ఓ వాహనాన్ని ఆపి తనిఖీలు చేస్తుండగా కారులో వెనుక కూర్చున్న ఒకరు బ్యాగులో నుంచి గ్రెనెడ్ తీసి జవాన్లపై విసిరేందుకు యత్నించాడు.అంతలో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకొని మాస్కు తొలగించి ప్రశ్నించగా అతను లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీం అబ్రార్ అని తేలింది.అతన్ని ఇంటరాగేట్ చేసి అతని వద్ద నుంచి పిస్టల్, హ్యాండ్ గ్రెనెడ్లను స్వాధీనం చేసుకున్నారు.మల్హూరాలోని ఓ ఇంట్లో తాను ఏకే -47 రైఫిల్ ఉంచానని చెప్పడంతో అతన్ని తీసుకొని రైఫిల్ స్వాధీనం చేసుకునేందుకు జవాన్లు వెళ్లారు.ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఇంట్లో ఉన్న మరో విదేశీ ఉగ్రవాది కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లతోపాటు నదీం అబ్రార్గా యపడ్డారు.గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి అదనపు బలగాలు ఉగ్రవాది ఉన్న ఇంటిని చుట్టుముట్టాయి.జవాన్లు జరిపిన కాల్పుల్లో కమాండర్ అబ్రార్ తోపాుట ఇంట్లో ఉన్న మరో ఉగ్రవాది హతమయ్యారు.