ఉన్నావో దళిత బాలికలపై పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
ఉన్నావో: ఓ పొలంలో బుధవారం అపస్మారకస్థితిలో కనిపించిన ముగ్గురు దళిత బాలికల్లో ఇద్దరు మృతి చెందారు. మరొకరు కాన్పూరులోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోకు చెందిన బాలికలు ముగ్గురు పశుగ్రాసం కోసం వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యారు. రాత్రి పొలంలో అపస్మారక స్థితిలో కనిపించారు.తాజాగా, మృతి చెందిన ఇద్దరు బాలికలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. బాలికలపై విష ప్రయోగం జరిగిందని, వారి దుపట్టాలతోనే వారిని కట్టివేసినట్టు నివేదికలో బయటపడింది. విష ప్రయోగం కారణంగానే వారు మృతి చెందినట్టు నివేదిక ధ్రువీకరించింది.అయితే, అది ఎలాంటి విషం అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.బాలికలకు చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రికి ఉన్నావో జిల్లా కలెక్టర్ రవీంద్రకుమార్ లేఖ రాస్తూ.. చికిత్సకు అయిన మొత్తం ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందిస్తామని తెలిపారు. కాగా, రీజెన్సీ ఆసుపత్రి వద్దకు చేరుకున్న భీమ్ ఆర్మీ కార్యకర్తలు మెరుగైన చికిత్స కోసం బాలికను ఢిల్లీకి తరలించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ ఘటనతో ఉన్నావోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసుల బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.
అయితే, అది ఎలాంటి విషం అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.బాలికలకు చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రికి ఉన్నావో జిల్లా కలెక్టర్ రవీంద్రకుమార్ లేఖ రాస్తూ.. చికిత్సకు అయిన మొత్తం ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందిస్తామని తెలిపారు. కాగా, రీజెన్సీ ఆసుపత్రి వద్దకు చేరుకున్న భీమ్ ఆర్మీ కార్యకర్తలు మెరుగైన చికిత్స కోసం బాలికను ఢిల్లీకి తరలించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ ఘటనతో ఉన్నావోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసుల బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.
బాలికలకు చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రికి ఉన్నావో జిల్లా కలెక్టర్ రవీంద్రకుమార్ లేఖ రాస్తూ.. చికిత్సకు అయిన మొత్తం ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందిస్తామని తెలిపారు. కాగా, రీజెన్సీ ఆసుపత్రి వద్దకు చేరుకున్న భీమ్ ఆర్మీ కార్యకర్తలు మెరుగైన చికిత్స కోసం బాలికను ఢిల్లీకి తరలించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ ఘటనతో ఉన్నావోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసుల బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.
తాజాగా, మృతి చెందిన ఇద్దరు బాలికలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. బాలికలపై విష ప్రయోగం జరిగిందని, వారి దుపట్టాలతోనే వారిని కట్టివేసినట్టు నివేదికలో బయటపడింది. విష ప్రయోగం కారణంగానే వారు మృతి చెందినట్టు నివేదిక ధ్రువీకరించింది.