East Godavari
ఉత్తర ద్వార దర్శనం
ద్వారకాతిరుమల మన జనప్రగతి:-
ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం వేలాదిగా తరలివచ్చిన యాత్రికులు గోవింద స్వాములు స్వామివారి దివ్య మూర్తులను కనులారా వీక్షించారు. ఆలయ అధికారులు దశ ప్రాంగణాన్ని సుగంధ పరిమళ పుష్ప మాలికలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి గరుఢ వాహనంపై ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. తొలుత ఆలయ ఛైర్మన్ ఎస్‌వి సుధాకర్ రావు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇఒ భ్రమరాంబ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు.