ఈ నెల 22 న బాలబాలికల జిల్లా షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు.
శ్రీకాకుళం జనవరి 19:- జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22 న పాత పట్నం మండలంలోని పెద్ద వీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబ్ జూనియర్ బాల, బాలికల జిల్లా షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు జరుగుతాయని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చిన్నాల కుర్మా నాయుడు , జిల్లా అధ్యక్షుడు జి. రాము మంగళవారం ఒక సంయుక్త ప్రకటన లో తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 2004 జనవరి ఒకటి తరువాత జన్మించిన వారై ఉండాలని, ఆధార్ కార్డు, జనన ధృవీ కరణ పత్రంతో హాజరు కావాలన్నారు. హాజరగు క్రీడాకారులు కోవిడ్-19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కార్యదర్శి మురళి మోహన్ రావు తెలుపుతూ… ఇతర వివరా లకు ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణ రావు 9441347551 , 9959286923. నంబరులో సంప్రదించాలన్నారు. ఈ ఎంపికలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు