ఇళ్ల పట్టాల పంపిణీ, వైఎస్ఆర్ జగనన్న కాలనీ నిర్మాణాలను విజయవంతం చేయండి. డిప్యూటీ కలెక్టర్ , తహశీల్దార్ లతో చర్చించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
రామాపురం డిసెంబర్ 19
ఈ నెల 25న ప్రారంభమయ్యే ఇళ్ల పట్టాల పంపిణీ , వై ఎస్ ఆర్ జగనన్న కాలనీ నిర్మాణ ప్రారంభ కార్యక్రమాలును విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి లోని తన కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ సృజన, తహశీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి లతో ఇళ్ల పట్టాల పంపిణీ, వై ఎస్ ఆర్ జగనన్న కాలనీ నిర్మాణ ప్రారంభాలపై ఆయన దిశ నిర్దేశం చేశారు. నారాయణరెడ్డి గారిపల్లె సమీపంలో రాయచోటి పట్టణ పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్ రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద లే అవుట్ అని, ఇక్కడ అన్ని వసతులతో కూడిన నిర్మాణాలును చేపట్టాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రారంభ కార్యక్రమాలును చేపట్టాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డి సి సి బి డైరెక్టర్ వెంకటరామి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలిమి హారూన్, వైఎస్ఆర్ సీపీ నాయకులు జిన్నా షరీఫ్ , కూరగాయల మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.