ఆదర్శ పట్టణంగా, సుందరంగా పులివెందులను తీర్చిదిద్దుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆదర్శ పట్టణంగా, సుందరంగా పులివెందులను తీర్చిదిద్దుతాం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
పులివెందుల నియోజకవర్గ పరిధిలో రూ.631 కోట్ల వ్యయంతో 25 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
రూ. 27 కోట్లతో వేముల మండలం నల్లచెరువుపల్లెలో నెలకొల్పిన 132 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం
పులివెందుల మన జనప్రగతి జులై 0:-:
పులివెందుల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు
గురువారం ఇడుపులపాయలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి ఉత్సవంలో పాల్గొనే నిమిత్తం.. జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై పులివెందుల నియోజకవర్గ పరిధిలో రూ.631 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన 25 రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం జగనన్న పచ్చ తోరణం కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా.. 30 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి విజయకుమార్ కు అందజేసి సభా కార్యక్రమానికి శుభారంభం చేశారు ఈ సందర్బంగా బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహానేత దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన సందర్భంగా అందర్నీ ఆత్మీయంగా కలుసుకుని ఉత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ రోజున తన సొంత గడ్డపై మీ అందరిముందు నిలుచున్నానంటే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే” అన్నారు. ముఖ్యమంత్రిగా మీ అందరి రుణం తీర్చుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నానన్నారు. మీ ముందే ప్రత్యక్షంగా ఇదే వేదికపై ఎన్నో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశామని వాటి వివరాలను అశేష జనవాహిని ముందు చదివి వినిపించారు
1. ఆర్‌అండ్‌బి శాఖ – రూ.181.34 కోట్ల వ్యయంతో.. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా.. సిటీ సెంట్రామ్, రింగ్ రోడ్ సుందరీకరణ, మెయిన్ రోడ్లు, ఎపిసిఎఆర్ఎల్(కార్ల్) రోడ్ల విస్తరణ, రాయలాపురం వంతెన వద్ద 4 లేన్ల రహదారిని నిర్మించే కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు
2. మున్సిపల్ అథారిటీ, పట్టణ అభివృద్ధి (ఎంఎ&యుడి)- రూ.154.20 కోట్ల వ్యయంతో పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా జగన్న హౌసింగ్ కాలనీలలో – వాటర్ సప్లై, మురుగునీటి వ్యవస్థ, రోడ్లు & కాలువలు నిర్మించే పనులకు శిలాఫలకం వేయడం జరిగిందన్నారు
3. మున్సిపల్ అథారిటీ, పట్టణ అభివృద్ధి (ఎంఎ&యుడి)- రూ.139.19 కోట్ల వ్యయంతో పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, సిటిజన్ సర్వీస్ సెంటర్, స్మశాన వాటిక, మొదలైన కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు
4. జల వనరుల అభివృద్ధి (డబ్ల్యూఆర్ డి) – రూ.75.65 కోట్ల వ్యయంతో పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా.. ఉలిమెల్ల సరస్సు, గరుడాల నది సుందరీకరణ పనులకు శిలాఫలకం ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు
5. ఎపిఎస్‌ఎస్‌డిసి – రూ.30.00 కోట్ల వ్యయంతో పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా.. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం (స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు
6. అటవీ శాఖ – రూ. 41.30 కోట్ల వ్యయంతో పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా.. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 41 ఎకరాల రాణి తోపు సెంటెనరీ పార్క్ ను మోడల్ బొటానికల్ గార్డెన్ గా అభివృద్ధి చేసేందుకు ఆయా పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు
7. ప్రణాళికా విభాగం – కొన్ని వందల కోట్ల వ్యయంతో పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా.. నిర్మించతలపెట్టిన బహుళ నిర్మాణ పనులకు సంబంధించి మెగా శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు
8. ఎపిఐఐసి – రూ. 22.43 కోట్లతో నిర్మించ తలపెట్టిన పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా.. మురుగునీటి పనుల (గ్రే వాటర్ పునర్వినియోగం) నిర్మాణాలకు శిలాఫలకం వేయడం జరిగిందన్నారు
9. పాఠశాల విద్య – రూ. 7.08 కోట్లతో నిర్మించ తలపెట్టిన పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా.. అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాలలో నూతన భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశామన్నారు
10. ఆర్‌డబ్ల్యుఎస్ & ఎస్ – అత్యధికంగా.. రూ.480.00 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు
11. ఎసిఎ. – కోట్లాది రూపాయల అంచనా వ్యయంతో డా. వైయస్ఆర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు
12. మార్కెటింగ్ శాఖ – రూ.2.00 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో పులివెందుల, వెంపల్లెలో రైతు బజార్లను నిర్మించేందుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. అంతే కాకుండా
13. ఎపి ట్రాన్స్కో : రూ. 27.00 కోట్ల వ్యయంతో వేముల మండలంలోని నల్లచెరువుపల్లిలో 14 గ్రామాలకు స్వచ్ఛమైన కరెంటు అందించేందుకు గాను.. గతంలో ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేసిన 132 కెవి. విద్యుత్ సబ్‌స్టేషన్ కు ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో పాటు.. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి దనుంజయ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్, జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్, ఎస్పి కెకెఎన్ అన్బు రాజన్, పులివెందుల నియోజకవర్గ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు