ఆదర్శమూర్తి అబ్దుల్ కలాం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
రాయచోటి మన జనప్రగతి జూలై 27
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆదర్శమూర్తి అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.అబ్దుల్ కలాం 7 వ వర్ధంతి సందర్భంగా రాయచోటిలోని వైయెస్ఆర్ సిపి కార్యాలయంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలసి శ్రీకాంత్ రెడ్డి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరంగానూ, విద్యావేత్తగా, అధ్యాపకుడిగా, రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయ మన్నారు.సామాన్య కుటుంభంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి, మిస్సైల్ మ్యాన్ గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప ప్రజ్ఞాశాలి అని అన్నారు.రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలోనూ ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శనీయులుగా నిలిచారన్నారు. కలలను సాకారం చేసుకోమంటూ విద్యార్థి లోకాన్ని తట్టిలేపారన్నారు. అబ్దుల్ కలాం బాటలో విద్యార్థులు, యువత నడవాలని శ్రీకాంత్ రెడ్డికోరారు.
ఈకార్యక్రమంలో జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, హాబీబుల్లా ఖాన్, పిఆర్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాజు, కౌన్సిలర్లు ఫయాజూర్ రెహమాన్,ఆసీఫ్ అలీఖాన్, ఫయాజ్ అహమ్మద్, కొలిమి ఛాన్ బాషా, గౌస్ ఖాన్, అల్తాఫ్, సుగవాసి శ్యామ్, అన్నా సలీం , రియాజుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.