Andhra PradeshAnanthapurHyderabadLatest NewsPoliticalTelangana
ఆంధ్ర వదిలేసి తెలంగాణకు వస్తా..జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర వదిలేసి తెలంగాణకు వస్తా..
జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానని, ఆంధ్రను వదిలేసి తెలంగాణకు వస్తానని అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. సీఎం కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ను కలవలేకపోయిన ఆయన మంత్రి కేటీఆర్ ను కలిశారు. తర్వాత కాంగ్రెస్ శాససభ పక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. జానారెడ్డి ఓడిపోతానని తాను ముందే చెప్పానని గుర్తుచేశారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజాలు బాగాలేవని, హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.